Home  »  TV News  »  ఏడడుగులు వేసిన రిషి, వసుధార!

Updated : Feb 15, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -686లోకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో.. రిషి గురించి వసుధార ఆలోచిస్తుంటుంది. రిషి సర్ కి కోపమొచ్చిందని ఫోన్ చేద్దామని చేస్తుంది. అలాగే అటువైపు నుండి రిషి కూడా ట్రై చేయడంతో ఇద్దరికీ బిజీ అని వస్తుంది. వసుధార ఎవరితో మాట్లాడుతుందని కోపంతో.. ఫోన్ స్విచ్ అఫ్ చేస్తాడు. "నీకు పెళ్లయినా మన మధ్య ఈ బంధమేంటి.. ఇంకెంత కాలం ఈ గుండె గదిలో ఉంటావ్.. ఖాళీ చేసి వెళ్ళిపో వసుధార ప్లీజ్" అని అనుకుంటూ రిషి బాధపడుతుంటాడు. మరోవైపు ఈ బాధ ఎంతో కాలం ఉండదు. నా మీద కోపం తో నిజం తెలుసుకోలేక పోతున్నారు. దీనికి త్వరలోనే ముగింపు ఇస్తానని వసుధార అనుకుంటుంది.

ఆ తర్వాత పుష్ప కాలేజీకి పని మీద వస్తుంది. పుష్ప దగ్గర  చక్రపాణి నెంబర్ తీసుకుంటాడు రిషి. ఆ తర్వాత చక్రపాణికి ఫోన్ చేసి నిజం తెలుసుకోవాలనుకుంటాడు.. వెంటనే ఫోన్ చెయ్యడంతో చక్రపాణికి బదులుగా వసుధార లిఫ్ట్ చేసి మాట్లాడడంతో.. "కాలేజీకి రావట్లేదా" అంటూ మాట్లాడి కట్ చేస్తాడు. రాజీవ్ తాళి కట్టలేదు.. మరి ఎవరు కట్టారు.. ఇంత తక్కువ సమయంలో ఎలా కుదిరినట్లు? ఏదో లింక్ మిస్ అవుతున్నానని రిషి అనుకుంటాడు 

రిషి మూడాఫ్ లో ఉండి ఒక దగ్గర కూర్చుని ఉంటాడు.. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార.. రిషి ఏ స్టైల్ లో కూర్చున్నాడో అదే విధంగా కూర్చుంటుంది. తనని రిషి చూసి.. "నువ్వు ఎప్పుడు వచ్చావ్" అని అంటాడు.. మీ వెనకాల ఎప్పటికీ ఉంటాను సర్ అని అంటుంది.. వెనకాల కాదు పక్కన ఉండాలని రిషి మనసులో అనుకుంటాడు.. సర్ వెనకాల ఉన్నవాళ్ళు పక్కకు కూడా వస్తారు.. అలాగే ముందుకు కూడా వస్తారని వసుధార అనగానే.. "మాథ్స్ లో లాజిక్ లు ఉంటాయి గాని జీవితంలో కాదు" అని రిషి అంటాడు. సర్ విశాల హృదయంతో ఆలోచించండి అని వసుధార చెప్పగా.. చెప్పడం ఈజీనే కానీ ఆ తర్వాత వచ్చే బాధనే భరించడం కష్టమని రిషి అంటాడు. సరే వెళ్ళని రిషి అనగా.. మీరు రానిదే నేను వెళ్ళనని వసుధార అంటుంది. "అందరూ మనల్నే చూస్తున్నారు నువ్వు వెళ్ళు.. నేను రాను" అని రిషి అంటాడు. వసుధార మొండిగా ఏడు లెక్క పెట్టేసరికి మీరు రావాలని అనగానే.. "మొండిదానివి" అని చెప్పి రిషి వచ్చేస్తుంటాడు. రిషితో కలిసి వసుధార నడుస్తూ.. ఏడు అడుగులు వేస్తున్నామని అనుకుంటుంది.. ఆ సీన్ చూడముచ్చటగా ఉంటుంది. మరో వైపు జగతి, మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటారు. రిషి రావడంతోనే.. ఏదో ఆర్గుమెంట్ చేస్తున్నట్లు జగతి చేస్తుంటుంది. దీంతో మహేంద్ర కు అర్థం కాక అలా చూస్తు ఉండిపోతాడు.. మహేంద్ర నువ్వు వస్తావా? రావా? అని‌ జగతి అడుగగా.. "ఎక్కడికి మేడం నేను తీసుకెళ్తాను రండి" అని రిషి అనగానే.. జగతి సంతోషపడుతుంది. రిషిని జగతి ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.